Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం.. నిందితుడికి సహకరించిన బాధితురాలి స్నేహితురాళ్లు!

  • డబ్బుల విషయంలో గొడవ
  • గుంటూరు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం
  • సహకరించిన బాధితురాలి స్నేహితులు
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. డబ్బుల విషయంలో గొడవ తలెత్తగా మురో ముగ్గురితో కలిసి స్నేహితుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక, ఆ ఘటనను చిత్రీకరించి నెట్‌లో పెడతానని బెదిరించాడు. బాధితురాలి స్నేహితురాళ్లే నిందితుడికి సహకరించడం గమనార్హం. ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం..

గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, హేమలత లంగర్‌హౌస్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్‌లో వీరి స్నేహితురాలైన మరో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఇటీవల ఈ యువతికి రాజ్‌కిరణ్ అనే యువకుడితో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం ముదరడంతో అతడు కూడా ఆమెకు  సమీపంలోనే ఓ హాస్టల్‌కు మారాడు.

ఈ క్రమంలో సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న జూనియర్ ఆర్టిస్టుల కోసం ఇద్దరూ కలిసి ‘మన’ అనే సంస్థను ఏర్పాటు చేసి అటువంటి వారి వివరాలు సేకరించారు.  వారందరి నుంచి సభ్యత్వం కోసం కొంత మొత్తం వసూలు చేశారు. అయితే, ఈ డబ్బుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కక్షపెంచుకున్న రాజ్‌కిరణ్ మార్చి 5న శిరీష, హేమలతతోపాటు యువతిని కూడా గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జ్‌లో రూము తీసుకుని అందులో పెట్టాడు.

అనంతరం హేమ, శిరీషలు బాధిత యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వగా, దానిని తాగిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో రాజ్‌కిరణ్ తన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చూపించి పలుమార్లు యువతిని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు పెరగడంతో యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Tollywood
Junior Artist
Gang Rape
SR Nagar
Hyderabad

More Telugu News